నెల్లూరు నగరంలోని వివిధ పోలీసుస్టేషన్ల పరిధిలో క్రియాశీలకంగా ఉన్న 45 మంది రౌడీషీటర్లను పోలీసులు కౌన్సెలింగ్‌లో భాగంగా సోమవారం వీఆర్సీ సెంటర్ నుంచి గాంధీబొమ్మ కూడలి వరకు సుమారు 1 కి.మీ మేర రోడ్డుపై నడిపించారు. చెప్పులు లేకుండా ఒంటి కాలిపై నిలబెట్టారు. నేర కార్యకలాపాల్లో పాల్గొనబోమని, సత్ప్రవర్తనతో నడుచుకుంటామని ప్రమాణం చేయించారు. అనంతరం వారిని అండర్‌టేకింగ్ తీసుకున్నారు.
short by
srikrishna /
10:41 am on
02 Dec