For the best experience use Mini app app on your smartphone
చిరుతను చంపి వండుకుని తిన్నారంటూ ఒడిశాలోని నౌపడా జిల్లాలో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. అడవిలో ఈ నెల 15న వేటగాళ్లు అడవి పందుల కోసం వేసిన ఉచ్చులో చిరుత చిక్కుకుందని, దీంతో దాన్ని చంపి మాంసాన్ని వండుకొని తిన్నారని అసిస్టెంట్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ ముస్తాఫా సలేహ తెలిపారు. నిందితుల ఇళ్లపై దాడి చేయగా చిరుతపులి చర్మం, తల, మిగిలిపోయిన మాంసాన్ని, ఇతర భాగాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
short by Sri Krishna / 10:10 am on 21 Nov
For the best experience use inshorts app on your smartphone