అఖిల భారత సర్వీస్ ప్రవర్తన నియమాలను ఉల్లంఘిస్తూ రాజకీయ సమావేశాల్లో పాల్గొన్న ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌పై తీవ్రమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, అవసరమైతే సర్వీసు నుంచి తొలగించాలని ఏపీ ఉప సభాపతి రఘురామ కృష్ణరాజు కేంద్ర డీఓపీటీ శాఖకు సోమవారం లేఖ రాశారు. సునీల్ కుమార్ రాజకీయ సమావేశంలో పాల్గొన్నారని, రాజకీయ లబ్ధి కోసం దళితులు, కాపులు ఏకమవ్వాలని వ్యాఖ్యలు చేశారని ఆ లేఖలో పేర్కొన్నారు.
short by
srikrishna /
08:35 am on
02 Dec