For the best experience use Mini app app on your smartphone
కేరళలోని పాలక్కాడ్ సమీపంలో రోడ్డు దాటేందుకు యత్నిస్తున్న ఓ పురుషుడు, మహిళను కారు ఢీకొట్టగా, దాని వేగం ధాటికి సదరు వృద్ధులు దాదాపు 15 మీటర్ల దూరం ఎగిరిపడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వృద్ధులను స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించగా అప్పటికే వారు చనిపోయారు. మద్యం మత్తులో కారు నడిపిన ప్రేమ్‌నాథ్‌ అనే 45 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
short by Srinu Muntha / 02:15 pm on 23 Nov
For the best experience use inshorts app on your smartphone