కరీంనగర్ జిల్లా కేంద్రంలో 3 రోజులుగా ఓ యువతి కబరస్తాన్ (స్మశానం)లోని తల్లి సమాధి వద్దే ఉంటోంది. 3 రోజుల క్రితం తల్లి చనిపోగా, ఆమె కుమార్తె డిప్రెషన్‌లోకి వెళ్లింది. ఆపై ఇంట్లో నుంచి పారిపోయి పగలు, రాత్రి తేడా లేకుండా సమాధిపైనే కూర్చుంటూ, అక్కడే నిద్రపోతోంది. ఈ దృశ్యాలను కొందరు సెల్‌ఫోన్‌లో రికార్డు చేశారు. కదిలించే ప్రయత్నం చేయగా సదరు యువతి కోపంతో చూస్తోందని స్థానికులు చెబుతున్నారు.
short by
Devender Dapa /
12:16 pm on
02 Dec