For the best experience use Mini app app on your smartphone
దేశంలోని ప్రాంతీయ పార్టీల్లోకెల్లా భారత రాష్ట్ర సమితి ఖాతాల్లో అత్యధికంగా రూ.1,449 కోట్ల నగదు నిల్వలు ఉన్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత ఆ పార్టీ సీఈసీకి సమర్పించిన ఆడిట్‌ నివేదికలో ఈ వివరాలు ఉన్నాయి. ఇప్పటివరకు ఒడిశాలోని బిజూ జనతాదళ్‌ పార్టీ రూ.625 కోట్ల ముగింపు నిల్వలతో తొలి స్థానంలో ఉండగా, బీఆర్‌ఎస్‌ దాన్ని అధిగమించింది. ఇక టీడీపీకి రూ.272 కోట్లు, వైసీపీకి రూ.27 కోట్ల ముగింపు నిల్వలున్నాయి.
short by Sri Krishna / 02:54 pm on 23 Nov
For the best experience use inshorts app on your smartphone