దేవాదాయశాఖ సీజీఎఫ్ నిధులు రూ.20 కోట్లతో పిఠాపురం నియోజకవర్గంలో 19 ఆలయాలను అభివృద్ధి చేయనున్నట్టు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా పిఠాపురాన్ని అభివృద్ధి చేసే ప్రణాళికను వేగంగా ముందుకు తీసుకువెళ్లాలని.. దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రఖ్యాత ఆలయాలకు పునరుజ్జీవం కల్పించే పనులుకు అవసరమైన నిధులు దేవాదాయ శాఖ సమకూరుస్తుందని చెప్పారు.
short by
Devender Dapa /
10:51 pm on
14 Nov