శివమ్ అనే 22 ఏళ్ల యువకుడు తన పెళ్లికి ఒక రోజు ముందు జరిగిన హల్దీ వేడుకలో డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో మరణించాడు. ఉత్తరప్రదేశ్లోని హాథ్రస్లో ఈ ఘటన జరిగింది. శివమ్ తన బంధువులతో కలిసి సంతోషంగా డ్యాన్స్ చేస్తున్న వీడియో వెలుగులోకి వచ్చింది. అతను డ్యాన్స్ చేసి అలిసిపోయి కుర్చీలో కూర్చున్న కాసేపటికే కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
short by
Sri Krishna /
04:41 pm on
21 Nov