నారాయణపేట జిల్లాలోని మాగనూరు హైస్కూల్లో మధ్యాహ్న భోజనం వికటించి 50 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. బాధిత విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. ఈ ఘటనపై విచారణ జరిపి, నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్, సీఎంవో అధికారులను సీఎం ఆదేశించారు. బాధ్యులైన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. పౌష్టికాహారం విషయంలో రాజీ పడేది లేదని చెప్పారు.
short by
Srinu Muntha /
11:09 pm on
20 Nov