భారత్ మీదుగా రష్యాలోని వినియోగదారులకు పౌర & సైనిక అనువర్తనాలతో కూడిన విమానయాన భాగాలను చట్టవిరుద్ధంగా ఎగుమతి చేయడానికి కుట్ర పన్నాడంటూ 57 ఏళ్ల భారతీయుడు సంజయ్ కౌశిక్‌పై అమెరికా అభియోగాలు మోపింది. ఒరెగాన్ నుంచి భారత్ మీదుగా రష్యాకు నావిగేషన్ & ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్‌ను చట్టవిరుద్ధంగా తరలించేందుకు ప్రయత్నించాడని కౌశిక్‌పై ఆరోపణలు ఉన్నాయి. నేరం రుజువైతే అతనికి గరిష్టంగా 20 ఏళ్లు జైలు శిక్ష పడొచ్చు.
short by
Rajkumar Deshmukh /
01:05 pm on
23 Nov