మానవబాంబు ఉందంటూ బెదిరింపు రావడంతో కువైట్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానం (6E-1234) ముంబైలో ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. 6E-1234 విమానంలో మానవబాంబు ఉందని దుండగులు హైదరాబాద్ విమానాశ్రయానికి మెయిల్ పంపించారు. దీంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విమానాన్ని దారి మళ్లించారు. ప్రయాణికులను ఐసోలేషన్ ప్రాంతానికి తరలించి, తనిఖీలు చేపట్టారు. ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు.
short by
Devender Dapa /
10:44 am on
02 Dec