For the best experience use Mini app app on your smartphone
రైతులు, మహిళలు, ఓబీసీల మద్దతుతో పాటు మహిళలకు నెలకు రూ.1,500 అందించే 'లడ్కీ బహిన్ యోజన' పథకం మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి ఆధిక్యానికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే ఆర్‌ఎస్‌ఎస్‌లోని మొత్తం 35 విభాగాల ప్రచారం కూడా కలిసొచ్చింది. ‘ఏక్‌ హై తో సేఫ్‌ హై’ (ఐక్యంగా ఉంటేనే మనమంతా సురక్షితంగా ఉంటాం) వంటి బీజేపీ నినాదాలు కూడా ఓటర్ల మనసును గెలిచాయని నివేదికలు పేర్కొన్నాయి.
short by Sri Krishna / 03:17 pm on 23 Nov
For the best experience use inshorts app on your smartphone