టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వ్యక్తిగత సంపదలో చరిత్ర సృష్టించారు. మస్క్ నికర సంపద విలువ 2021లో నమోదైన 340 బిలియన్ డాలర్ల గరిష్ఠ స్థాయిని అధిగమించి ప్రస్తుతం 348 బిలియన్ డాలర్ల (రూ.29.38 లక్షల కోట్లు)కు చేరుకుందని బ్లూమ్బర్గ్ నివేదిక తెలిపింది. ప్రస్తుతం ఆయన ఎన్నడూ లేనంత సంపన్న వ్యక్తిగా నిలిచాడని ‘ఫోర్బ్స్’ పేర్కొంది. టెస్లా షేర్ల విలువలో అనూహ్య పెరుగుదలే, మస్క్ సంపద వృద్ధికి ప్రధాన కారణం.
short by
Srinu Muntha /
11:40 am on
23 Nov