రాజస్థాన్‌లో చితిని అంటిస్తుండగా బతికి ఉన్నాడని గుర్తించిన రోహితాశ్ అనే 25 ఏళ్ల చెవిటి, మూగ యువకుడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న రోహితాశ్ గురువారం చనిపోయాడని వైద్యులు నిర్ధారించగా, 2 గంటలపాటు మార్చురీ ఫ్రిజ్‌లో ఉంచారు. అయితే అంత్యక్రియలు నిర్వహించే క్రమంలో బతికే ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనకు బాధ్యులైన ముగ్గురు వైద్యులను సస్పెండ్ చేశారు.
short by
Bikshapathi Macherla /
11:06 pm on
22 Nov