నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంతో రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న ‘జైలర్ 2’లో షారుఖ్‌ఖాన్ అతిథి పాత్రలో నటించనున్నట్లు నివేదికలు తెలిపాయి. ‘జైలర్’లో శివరాజ్‌కుమార్, మోహన్‌లాల్ వంటి నటీనటులు సినిమాను మలుపుతిప్పే అతిథి పాత్రల్లో కనిపించారు. దీని సీక్వెల్‌లో నందమూరి బాలకృష్ణ అతిథిపాత్రలో కనిపిస్తారని తొలుత ప్రచారం జరిగినా.. ఇది సాధ్యమయ్యేలా కనిపించడం లేదని నివేదికలు పేర్కొన్నాయి.
short by
/
09:25 am on
02 Dec