కైకలూరుకు చెందిన ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ తన పదవితో పాటు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి శనివారం రాజీనామా చేశారు. MLC పదవికి చేసిన రాజీనామా లేఖను శాసన మండలి ఛైర్మన్ మోసేనురాజుకు పంపించారు. గతంలో టీడీపీలో ఉన్న జయమంగళ, ఎన్నికలకు కొద్ది నెలల ముందు వైసీపీలో చేరి, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించారు. కాగా, ఇటీవలే పలువురు MLCలు రాజీనామా చేయగా, వాటిని మండలి ఛైర్మన్ ఇంకా ఆమోదించలేదు.
short by
Srinu Muntha /
02:10 pm on
23 Nov