సంగారెడ్డి జిల్లా బుదేరాలో నిలిపి ఉంచిన కారు ఇంజిన్‌లోకి నాగుపాము దూరింది. తాటిపల్లి గ్రామానికి చెందిన చంద్రయ్య బుదేరాలో టీ స్టాల్ వద్ద టీ తాగుతుండగా పాము కారు కిందకు వెళ్లింది. జనం అలికిడితో కంగారుపడి ఇంజిన్‌లోకి దూరింది. పాములు పట్టడంలో నైపుణ్యం ఉన్న సద్దాం అనే వ్యక్తి దాన్ని బయటకు తీసి, సపర్యలు చేసి నీళ్లు తాగించాడు. గాలి ఊది శ్వాస ఆడేలా చేశాడు. అనంతరం సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలేశాడు.
short by
Devender Dapa /
05:32 pm on
02 Dec