నటి సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు ఈశా యోగా కేంద్రంలో సోమవారం కుటుంబీకులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. పెళ్లి సమయంలో సమంత చేతికున్న ఉంగరాన్ని చూసిన అభిమానులు, ఆ జంట ఫిబ్రవరిలోనే రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారనే ఊహాగానాలకు తెరలేపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 13న సమంత తన ముఖాన్ని చేతిపై ఉంచిన ఓ క్లోజప్ ఫొటోను పోస్ట్ చేసింది. ఆ ఫొటోలో కనిపించిన ఉంగరాన్నే ఆమె పెళ్లి సమయంలోనూ ధరించింది.
short by
srikrishna /
09:05 am on
02 Dec