హైదరాబాద్ మన్సూరాబాద్ డివిజన్ పరిధి శివగంగ కాలనీలో ఇంటి బయట ఉన్న ప్రేమ్‌చంద్ అనే 8 ఏళ్ల బాలుడిపై సుమారు 15-20 వీధి కుక్కలు దాడి చేశాయి. ప్రకాశం జిల్లాకు చెందిన తిరుపతిరావు, చంద్రకళ దంపతుల కుమారుడైన ప్రేమ్‌చంద్ పుట్టుకతోనే మూగవాడు. తండ్రి మేస్త్రీ పనికి వెళ్లగా, తల్లి ఇంట్లో నీళ్లు పడుతున్నప్పుడు కుక్కలు దాడి చేశాయి. తల, నడుము, వీపు భాగాల్లో తీవ్ర గాయాలైన బాలుడిని నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు.
short by
Devender Dapa /
04:32 pm on
02 Dec