నెల్లూరు నగరానికి చెందిన సీపీఎం నాయకుడు పెంచలయ్య హత్య కేసులో ఇటీవల అరెస్టయిన ‘లేడీ డాన్’ అరవ కామాక్షి ఇల్లు నేలమట్టం అయింది. నెల్లూరులోని ఆర్డీటీ కాలనీలో ఉన్న కామాక్షి నివాసంతో పాటు ఆమె అనుచరుల ఇళ్లను స్థానిక ప్రజలు సోమవారం కూల్చివేశారు. కామాక్షి తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని వారు చెప్పారు. మరోవైపు, పెంచలయ్య హత్యకు నిరసనగా మంగళవారం సీపీఎం పిలుపు మేరకు నెల్లూరు జిల్లా బంద్ కొనసాగుతోంది.
short by
srikrishna /
12:39 pm on
02 Dec