హిందువులలో వివాహం అనేది ఓ పవిత్రమైన బంధమని, అసాధారణమైన కష్టాలు/పరిస్థితులు ఉంటే తప్ప వివాహం జరిగిన ఏడాది లోపు రద్దు చేయలేమని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. పెళ్లై ఏడాది కూడా పూర్తి కాకుండానే విడాకులు కోరుతూ ఓ హిందూ జంట చేసిన అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. పరస్పర భేదాభిప్రాయాలనే కారణం తప్ప, ఎలాంటి అసాధారణ పరిస్థితి ఉన్నట్లు ఆధారాలు చూపలేదని హైకోర్టు పేర్కొంది.
short by
Rajkumar Deshmukh /
08:13 am on
30 Jan