For the best experience use Mini app app on your smartphone
జింక్, విటమిన్ డి, ఆరోగ్యకరమైన కొవ్వులతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల పురుషులు వారి స్పెర్మ్ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఫెర్టిలిటీ స్పెషలిస్ట్‌ డా.నమ్రత టెండూల్కర్ తెలిపారు. ఆమె ప్రకారం, పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచే టెస్టోస్టిరాన్‌ సరైన మోతాదులో ఉండాలంటే వ్యాయామం చేయాలి, ఒత్తిడి నియంత్రించుకోవాలి. బరువును అదుపులో ఉంచుకోవాలి, 7-8 గంటలు నిద్రపోవాలి. ధూమపానం, మద్యం సేవించకూడదు.
short by Devender Dapa / 09:05 pm on 20 Apr
ఛత్తీస్‌గఢ్‌లోని ఓ ఐస్‌క్రీం ఫ్యాక్టరీలో చోరీ కావడంతో ఇద్దరు కార్మికులను అనుమానించిన యజమాని వారిని చిత్రహింసలు పెట్టాడు. బాధితుల గోర్లు కత్తిరించి, విద్యుత్ షాక్‌ పెట్టిన వీడియోను ఓ వ్యక్తి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో విషయం బయటపడింది. ఎట్టకేలకు వారి నుంచి తప్పించుకున్న బాధితులు స్వస్థలమైన రాజస్థాన్‌కు పారిపోయారు. రూ.20వేల వేతనం అడ్వాన్స్‌గా అడిగినందుకే యజమాని హింసించినట్లు వారు చెప్పారు.
short by Bikshapathi Macherla / 10:15 pm on 20 Apr
రూ.80 లక్షల బీమా కోసం తన భార్య తనను చంపాలని చూస్తోందని UP మీరట్‌లో ఓ భర్త పోలీసులకు ఆశ్రయించాడు. ఆ మహిళ తుపాకీ పట్టుకుని చేసిన రీల్స్, బాయ్‌ఫ్రెండ్స్‌తో అసభ్యకర చాటింగ్‌ స్క్రీన్‌షాట్‌లను పోలీసులకు ఆధారాలుగా ఇచ్చాడు. తమకు 2012లో పెళ్లయిందని, ఆ తర్వాత ఆమె చాలా మందిని పెళ్లి చేసుకుందని అతడు పేర్కొన్నాడు. ప్రియుడితో కలిసి భర్తను చంపిన ముస్కాన్ మాదిరిగానే తాను చేస్తానని ఆమె బెదిరిస్తోందని చెప్పాడు.
short by Devender Dapa / 10:05 pm on 20 Apr
క్రైస్తవ మత బోధకుడు ప్రవీణ్‌ పగడాల పోస్ట్‌మార్టం రిపోర్ట్‌పై అనేక అనుమానాలు ఉన్నాయని మాజీ ఐఏఎస్‌ అధికారి విజయ్‌కుమార్ ఆరోపించారు. తన లిబరేషన్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున కోర్టులో పిల్‌ వేస్తామని చెప్పారు. ప్రవీణ్‌ పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో స్పష్టత లేదని, ట్రావెల్‌ చేసింది, ఆగింది, మద్యం కొనుగోలు చేసింది ఎక్కడనేది నిరూపించలేదన్నారు. మద్యం తాగి చనిపోయాడని కావాలని రాసినట్లు ఉందన్నారు.
short by Bikshapathi Macherla / 08:27 pm on 20 Apr
తన పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన అందరికీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. "47 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో అండగా ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, నాలుగోసారి సీఎంగా అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ రుణపడి ఉంటా, రాష్ట్రాభివృద్ధికి, తెలుగు ప్రజల అభ్యున్నతికి పునరంకితమవుతా" అని పేర్కొన్నారు. ఆత్మగౌరవం, ఆత్మ విశ్వాసం తెలుగువారి రక్తంలోనే ఉందని, మనం తిరుగులేని విజయాలు సాధించాలన్నారు.
short by Bikshapathi Macherla / 09:55 pm on 20 Apr
సీఎం చంద్రబాబు నాయుడు 75వ పుట్టిన రోజు సందర్భంగా ఆయన జీవితంపై రచించిన రెండు పుస్తకాలను ఏపీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామ కృష్ణంరాజు, కేంద్ర మాజీ మంత్రి అశోక గజపతిరాజు ఆవిష్కరించారు. అసెంబ్లీలో ఆయన చేసిన ప్రసంగాలపై రచించిన వీటిని జయప్రద ఫౌండేషన్‌ ప్రచురించింది. ఐటీ విప్లవం వచ్చిన వెంటనే తెలుగు జాతికి దీని ఫలాలు అందించాలని భావించిన గొప్ప నేత చంద్రబాబు అని పుస్తక రూపకర్త టీడీ జనార్ధన్‌ అన్నారు.
short by Bikshapathi Macherla / 10:55 pm on 20 Apr
పచ్చి ఉల్లిపాయల్లో సల్ఫర్, ఫైబర్, పొటాషియం, కాల్షియం, విటమిన్‌ బి, సి వంటి పోషకాలుంటాయని, వాటిని వేసవిలో తినడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. వారి ప్రకారం, ఉల్లిపాయలు శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తాయి. వడ దెబ్బ నుంచి కాపాడతాయి. ఉల్లిలో ఉండే నీరు శరీరంలోని తేమను మేనేజ్‌ చేస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. జీర్ణ, పేగు సంబంధిత సమస్యలను దూరం చేస్తాయి.
short by Srinu / 07:31 am on 21 Apr
ఏపీలో 2024 ఫిబ్రవరిలో ఎన్నికల ముందు వైసీపీ ప్రభుత్వం 6100 పోస్టులకు DSC నోటిఫికేషన్‌ ఇచ్చిన సమయంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ప్రస్తుతం ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ కొత్తగా దరఖాస్తు ఫారాన్ని పూర్తి వివరాలతో నింపి సబ్మిట్ చేయాలని నోటిఫికేషన్‌లో ఉంది. అభ్యర్థి గతంలో దరఖాస్తు చేసిన దానికన్నా ఎక్కువ సబ్జెక్టులు/ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకుంటే ఒక్కో పోస్టుకు రూ.750 చొప్పున ఫీజు చెల్లించాలి.
short by Devender Dapa / 09:12 pm on 20 Apr
ప్రకాశం జిల్లాలో బెస్తవారిపేట మండలం పెద్ద ఓపినేనిపల్లిలో ఆరుబయట క్రికెట్ ఆడుతుండగా పిడుగుపడి ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. పశువుల కాపరి ఒకరు తీవ్రంగా గాయపడగా, అతడిని కంభంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. మృతి చెందిన యువకులను 17 ఏళ్ల గోషిపోతల ఆకాష్, 18 ఏళ్ల పులిగుజ్జు తన్నిగా గుర్తించారు. ఆదివారం సెలవురోజు కావడంతో యువకులు క్రికెట్ ఆడారు.
short by Devender Dapa / 10:01 pm on 20 Apr
యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (UPSC) 111 అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా డిప్యూటీ డిప్యూటీ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌, జాయింట్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌, అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సహా పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. జనరల్‌ అభ్యర్థులు రూ.25తో చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. మే 1 లోగా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.
short by Bikshapathi Macherla / 11:38 pm on 20 Apr
ఏపీలో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లోని 31 మండలాల్లో సోమవారం తీవ్ర వడగాలులు, మరో 20 మండలాల్లో వడగాలులు వీచే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఆదివారం నంద్యాల జిల్లా అవుకులో 42.6°C, వెంకటగిరి (తిరుపతి), నగరి (చిత్తూరు)లో 42.5 °C అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని పేర్కొంది. రాగల 3 రోజుల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు అవకాశముందని తెలిపింది.
short by Srinu / 07:20 am on 21 Apr
అనంతపురం జిల్లాలోని కేజీబీవీల్లో 71 నాన్‌ టీచింగ్‌ ఉద్యోగాలకు పోస్టుల భర్తీకి కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన నోటిఫికేషన్‌ విడుదలైంది. దీనిద్వారా హెడ్‌ కుక్‌, అసిస్టెంట్‌ కుక్, చౌకిదార్‌, స్కావెంజర్ పోస్టులను భర్తీ చేస్తారు. 18 నుంచి 42 ఏళ్ల వయోపరిమితి ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. పదో తరగతి, అంతకంటే తక్కువ చదివిన మహిళలు అర్హులు. దరఖాస్తుకు ఏప్రిల్‌ 31వరకు గడువు ఉంది.
short by Bikshapathi Macherla / 09:12 pm on 20 Apr
తెలంగాణలో తొలి మహిళా కమాండో బృందం "టీ శివంగి"ని మంత్రి సీతక్క ప్రారంభించారు. ఆదిలాబాద్‌లో పర్యటించిన మంత్రి ఆ జిల్లా విభాగాన్ని ప్రారంభించి, మిగతా అన్ని జిల్లాల్లోనూ మహిళా కమాండో బృందాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. మహిళా పోలీసుల్లో ఔత్సాహికులైన వారికి 45 రోజులు కఠిన శిక్షణనిచ్చి ఈ కమాండో బృందాన్ని తయారుచేశారు. వీరికి ఆయుధాలు, టెక్నాలజీ సహా పలు అంశాలపై ట్రైనింగ్‌ ఇచ్చారు.
short by Bikshapathi Macherla / 11:15 pm on 20 Apr
బాపట్ల జిల్లా మార్టూరులో గ్రానైట్‌ ఫ్యాక్టరీలలో బ్లాస్టింగ్‌లకు ఉపయోగించే పేలుడు పదార్థాలను అక్రమంగా గోదాంలో నిల్వ ఉంచిన ఘటనలో వైసీపీ నేత, మరో వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి ఏడున్నర టన్నుల జిలెటెన్ స్టిక్స్​, ఓ బోలెరో, అశోక్ లెలైండ్​లను స్వాధీనం చేసుకున్నామన్నారు. వైసీపీ నేత దాసం హనుమంతురావు లైసెన్స్ లేకుండా హైదరాబాద్ నుంచి పేలుడు పదార్థాలను తెప్పించాడని చెప్పారు.
short by Devender Dapa / 09:28 pm on 20 Apr
మహబూబ్‌నగర్‌ జిల్లా నంచర్ల గేట్‌ సమీపంలో ఆటోను టిప్పర్‌ లారీ ఢీకొనడంతో డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. నంచర్ల గేట్‌ వైపు నుంచి మహమ్మదాబాద్‌ వైపు వెళ్తున్న ఆటోను కోస్గి వైపు వెళ్తున్న టిప్పర్‌ ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆటో నడుపుతున్న హన్వాడ మండలానికి చెందిన కాట్రావత్‌ సునీల్‌ మృతి చెందాడు. మృతుని తల్లి ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేశారు.
short by Bikshapathi Macherla / 10:09 pm on 20 Apr
కుల భేదాలను అంతం చేయడానికి హిందూ సమాజానికి ఒక ఆలయం, ఒక బావి, ఒక శ్మశానవాటిక ఉండాలని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఐదు రోజుల అలీఘర్ పర్యటనలో ఉన్న భగవత్, హిందూ సమాజానికి పునాదిగా "సంస్కారం (విలువలు)" ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. "కుటుంబం" సమాజంలో ప్రాథమిక యూనిట్‌గా ఉందని ఆయన పేర్కొన్నారు.
short by / 09:20 pm on 20 Apr
కర్ణాటక మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ), 1981 బ్యాచ్‌కు చెందిన ఓం ప్రకాష్ ఆదివారం బెంగళూరులోని హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్ ప్రాంతంలోని తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా, ఆయన హత్యకు గురయ్యారని, ఇందులో ఓ ప్రకాశ్ భార్య పల్లవి ప్రమేయం ఉందని పోలీసులు భావిస్తున్నట్లు నివేదికలు తెలిపాయి. ప్రస్తుతం పోలీసులు సంఘటన స్థలాన్ని సీజ్ చేశారు.
short by / 08:52 pm on 20 Apr
దిల్లీలోని సీలంపూర్‌లో 17 ఏళ్ల కునాల్ హత్య కేసులో ఇప్పటివరకు పోలీసులు 9 మందిని అరెస్టు చేశారు. వారిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు మైనర్లు ఉన్నారు. 'లేడీ డాన్' జిక్రా, సాహిల్, ఇద్దరు మైనర్లు ఈ దాడికి కుట్ర పన్నారని వారి ఆధారాలు సేకరించామని పోలీసులు తెలిపారు. దర్యాప్తులో సాహిల్, కునాల్ మధ్య పాత శత్రుత్వం ఉందని తేలింది.
short by / 09:07 pm on 20 Apr
అతి పిన్న వయస్కుడిగా ఐపీఎల్‌లోకి అడుగుపెట్టిన 14 ఏళ్ల ఆర్‌ఆర్ బ్యాట్స్‌మన్ వైభవ్ సూర్యవంశీ వీడియోను రాజస్థాన్ రాయల్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీనిలో ఎల్‌ఎస్‌జీ ఆల్ రౌండర్ అర్షిన్ కులకర్ణి అతనిని బ్యాట్ అడుగుతున్నట్లు కనిపిస్తుంది. ఆ వీడియోలో వైభవ్, "నేను బ్యాట్‌ను తర్వాత పంపుతాను మిత్రమా. నా దగ్గర బ్యాట్ లేదు. నేను సంజు భయ్యా బ్యాట్‌తో మ్యాచ్ ఆడాను" అని చెప్పారు.
short by / 09:11 pm on 20 Apr
గత ట్రేడింగ్ రోజున RRP సెమీకండక్టర్ లిమిటెడ్ షేర్లు 52 వారాల గరిష్ట స్థాయిలో ముగిశాయి. 2024 ఏప్రిల్ 18న కంపెనీ షేరు ధర రూ.17.35 కాగా శుక్రవారం నాటికి కంపెనీ షేరు ధర రూ.752.55కి చేరుకుంది. దీని ప్రకారం, 1 సంవత్సరం క్రితం కంపెనీలో పెట్టుబడి పెట్టిన రూ.లక్ష విలువ ఇప్పుడు రూ. 43 లక్షలకు పైగా పెరిగింది.
short by / 09:37 pm on 20 Apr
ఐపీఎల్ 2025లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పంజాబ్ కింగ్స్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 33, శశాంక్ సింగ్ 31* పరుగులతో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 157 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 73*, దేవదత్ పడిక్కల్ 61 రన్స్ రాణించడంతో ఆర్సీబీ.. 18.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఈ టోర్నీలో ఆర్సీబీకి ఇది ఐదో విజయం కావడం గమనార్హం.
short by / 08:08 pm on 20 Apr
ఐపీఎల్ చరిత్రలో CSK తరఫున ఆడిన అతి పిన్న వయస్కుడైన క్రికెటర్‌గా బ్యాటర్ ఆయుష్ మాత్రే ఆదివారం నిలిచాడు. 17 సంవత్సరాల 278 రోజుల వయస్సు గల మాత్రే, ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన IPL 2025 మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ తరఫున అరంగేట్రం చేశాడు. 2008లో 18 సంవత్సరాల 139 రోజుల వయసులో అభినవ్ ముకుంద్‌ సీఎస్కే తరఫున అరంగేట్రం చేశాడు. తాజాగా ఆ రికార్డును మాత్రే అధిగమించాడు.
short by / 08:47 pm on 20 Apr
2023లో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం చేసినందుకు యూపీలోని ఘజియాబాద్‌కు చెందిన భరత్ సింగ్ యాదవ్ నేతృత్వంలోని ప్రత్యేక పోక్సో కోర్టు మొహమ్మద్ నజీమ్, మొహమ్మద్ జాకీర్ అనే ఇద్దరు వ్యక్తులకు జీవిత ఖైదు విధించింది. ఈకో కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమెను ఇంటి వద్ద దింపుతామని చెప్పి, ఆమెను నిథోరా రోడ్ సమీపంలోని అడవులకు తీసుకెళ్లి కారులో ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు.
short by / 09:25 pm on 20 Apr
గోల్డ్‌మన్ సాచ్స్ నివేదిక ప్రకారం, ChatGPTకి పంపే ప్రతి ప్రశ్న 2.9 వాట్-అవర్‌ విద్యుత్తును ఉపయోగిస్తుంది. దాని వినియోగదారుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే OpenAI శక్తి వినియోగం రోజుకు దాదాపు 2.9 మిలియన్ కిలోవాట్-అవర్స్‌ ఉంటుంది. ఇటీవల OpenAI CEO సామ్ ఆల్ట్‌మాన్ మాట్లాడుతూ, ChatGPTతో 'ప్లీజ్‌', 'థ్యాంక్స్‌' వంటి పదబంధాలను ఉపయోగించడం వల్ల OpenAIకి విద్యుత్తు "10 మిలియన్ల డాలర్లు" ఖర్చవుతుందని అన్నారు.
short by / 09:33 pm on 20 Apr
ములుగు జిల్లా పూసురు ముల్లకట్ట బ్రిడ్జి వద్ద గుర్తుతెలియని మహిళ మృతదేహం ఆదివారం లభ్యమైంది. ముల్లకట్ట గోదావరి బ్రిడ్జి 27వ పిల్లర్ వద్ద మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు, పోలీసులకు సమాచారం అందించారు. మహిళ గులాబీ రంగు చీర, నీలం రంగు జాకెట్ ధరించి ఉందని, తలకు చెక్స్ టవల్ చుట్టుకుని ఎముకల గూడుగా మారిందని పోలీసులు చెబుతున్నారు.
short by News Telugu / 10:00 pm on 20 Apr
Load More
For the best experience use inshorts app on your smartphone