For the best experience use Mini app app on your smartphone
తెలంగాణలో 2025 జనవరి నుంచి జూన్ వరకు 126 కేసులు నమోదు చేసినట్లు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) తెలిపింది. ఇందులో 80 ట్రాప్ కేసులు, 8 అక్రమాస్తుల కేసులు, 11 ఆకస్మిక తనిఖీలు సహా ఇతర కేసులు ఉన్నాయి. ఈ కేసుల్లో 8 మంది అవుట్‌ సోర్సింగ్ ఉద్యోగులతో సహా 125 మంది ప్రభుత్వ ఉద్యోగులను ట్రాప్ చేసి అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఈ ట్రాప్ కేసుల్లో రూ.24.57 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
short by Devender Dapa / 11:21 pm on 01 Jul
For the best experience use inshorts app on your smartphone