For the best experience use Mini app app on your smartphone
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్‌-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల మధ్య భారత వైమానిక దళం బుధవారం రాత్రి 9.30 నుంచి పాకిస్థాన్ సరిహద్దులో భారీ స్థాయిలో విన్యాసాలు చేపట్టనుంది. ఇందుకు సంబంధించి ఆయా విభాగాలకు వాయుసేన సమాచారాన్ని (NOTAM) జారీ చేసింది. రఫేల్‌, మిరాజ్‌ 2000, సుఖోయ్‌-30 వంటి అనేక యుద్ధవిమానాలు ఇందులో పాల్గొంటాయని పేర్కొంది. గురువారం తెల్లవారుజామున 3 గంటల వరకు విన్యాసాలు జరగనున్నాయి.
short by Devender Dapa / 10:40 pm on 06 May
అత్యవసర పరిస్థితులకు పౌర రక్షణ సంసిద్ధతను పెంపొందించడానికి మే 7న సాయంత్రం 4 గంటలకు పౌర రక్షణ మాక్ డ్రిల్‌లు నిర్వహించనున్నట్లు శ్రీనగర్ పోలీసులు మంగళవారం తెలిపారు. కశ్మీర్‌లోని వివిధ ప్రదేశాలలో సైరన్‌లు మోగుతాయని, ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, ఆందోళన చెందవద్దని కోరారు. ఈ మాక్‌ డ్రిల్‌ విజయవంతం కావాలంటే ప్రజలు పూర్తిగా సహకరించాలని ఈ సందర్భంగా పోలీసులు పేర్కొన్నారు.
short by / 10:55 pm on 06 May
భారత్‌ ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధిస్తున్న దేశాలలో ఒకటి అని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్‌ ట్రంప్‌ అన్నారు. అయితే అమెరికా "దీనిని సహించదు" అని ఆయన చెప్పారు. "వారు ఇప్పటికే సుంకాలను పూర్తిగా తగ్గించడానికి అంగీకరించారు. వారు ఇప్పటికే అంగీకరించారు. వారు నాకు తప్ప మరెవరికీ అలా చేసి ఉండరు" అని ట్రంప్ అన్నారు. "ఆయా దేశాలు అమెరికాలో షాపింగ్ చేయగల ప్రత్యేక హక్కు కోసం చెల్లించబోతున్నాయి" అని ఆయన అన్నారు.
short by / 11:19 pm on 06 May
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఓవల్ కార్యాలయంలో సమావేశమయ్యారు, కెనడాను 51వ అమెరికా రాష్ట్రంగా చేయాలనే మాజీ ప్రధాని ఆలోచనను మార్క్ కార్నీ తిరస్కరించారు. "కెనడా అమ్మకానికి లేదు, అది ఎప్పటికీ అమ్మకానికి ఉండదు" అని కార్నీ అన్నారు. దీనికి ట్రంప్ "ఎప్పుడూ అలా చెప్పకండి" అని బదులిచ్చారు. అమెరికా, కెనడా అద్భుతమైన వివాహం చేసుకుంటాయని ట్రంప్ గతంలో అన్నారు.
short by / 11:22 pm on 06 May
భారత్‌-పాకిస్థాన్‌ ఉద్రిక్తతల మధ్య వైమానిక దళం జారీ చేసిన నోటామ్‌ (ఎయిర్‌మెన్‌కు నోటీసు) అనేది పైలట్లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు, ఇతర విమానయాన సంబంధిత వ్యక్తులకు విమాన ప్రయాణంపై ముఖ్యమైన సమాచారాన్ని అందించే నోటీసు. ఇది విమానాశ్రయం/ప్రాంతం లేదా ఇతర సౌకర్యాలకు తాత్కాలిక మార్పులు లేదా ప్రమాదాల గురించి సమాచారాన్ని అందిస్తుంది. దీనిద్వారా పైలట్లు సరైన నిర్ణయం తీసుకునేందుకు వీలు కలుగుతుంది.
short by / 11:45 pm on 06 May
మంగళవారం దేశ రాజధాని దిల్లీలో బంగారం ధరలు 10 గ్రాములకు రూ.2,400 పెరిగి రూ.99,750 కు చేరుకున్నాయని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. సోమవారం నాడు 99.9% స్వచ్ఛత కలిగిన బంగారం ధర 10 గ్రాములకు రూ.97,350 వద్ద ముగియడం గమనార్హం. ఇదే సమయంలో వెండి ధర కూడా రూ.1,800 పెరిగి కిలోకు రూ.98,500కు చేరుకుంది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.98,460గా ఉంది.
short by / 10:19 pm on 06 May
జమ్ముకశ్మీర్‌ కిష్త్వార్‌లోని చీనాబ్ ఉపనది మారుసుదర్‌పై పాకల్ దుల్ ఆనకట్టకు ఓవర్ హెడ్ ట్రాన్స్‌మిషన్ లైన్లు వేయడానికి భారత ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. సింధు జలాల ఒప్పందం కిందకు వచ్చే నదులపై నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు గానూ ఆనకట్ట పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. అదే జరిగితే ఒప్పంద నదులపై నీటిని నిల్వ చేయగల మొదటి ఆనకట్ట కూడా ఇదే అవుతుంది.
short by / 10:32 pm on 06 May
చీనాబ్ నదిపై నిర్మిస్తున్న పాకల్ దుల్, కిరు అనే రెండు జలవిద్యుత్ ప్లాంట్లను కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది నాటికి ప్రారంభించనుంది. జమ్మూకశ్మీర్‌లో పాకల్ దుల్, కిరుతో సహా 5 జలవిద్యుత్ ప్రాజెక్టులను నిర్మిస్తున్న కాంట్రాక్టర్లను పనులను వేగవంతం చేయాలని, జాప్యాలను నివారించాలని విద్యుత్ మంత్రిత్వ శాఖ నోటీసులు ​​జారీ చేసింది. పహల్గాం దాడి తర్వాత పాక్‌తో భారతదేశం సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది.
short by / 10:35 pm on 06 May
ఐపీఎల్‌లో ఎంఎస్ ధోని భవిష్యత్తు ఏంటనే ప్రశ్నకు చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్‌ సమాధానం చెప్పారు. "ఏం చేయాలనేది అతడి (ధోనీ) నిర్ణయం.. అతడు ఏదైనా నిర్ణయం తీసుకుంటే, మాకు కచ్చితంగా చెబుతాడు. కానీ ఇప్పటివరకూ ధోనీ మాకు అటువంటిదేదీ చెప్పలేదు," అని ఆయన పేర్కొన్నారు. కాగా 43 ఏళ్ల మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ 2025లో సీఎస్కే కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఆ జట్టు ప్లేఆఫ్స్‌కు దూరమైంది.
short by / 10:35 pm on 06 May
తనపై పెరిగిన ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఆర్సీబీ, టీమిండియా కెప్టెన్సీని వదులుకున్నానని విరాట్ కోహ్లీ ఓ పాడ్‌కాస్ట్‌లో వెల్లడించాడు. "నాపై ఉన్న భారీ అంచనాలు, నాలో తీవ్ర ఒత్తిడికి కారణమైంది. అందుకే కెప్టెన్సీ బాధ్యతల నుంచి నెమ్మదిగా బయటపడ్డా," అని కోహ్లీ చెప్పాడు. కాగా 2013-2022 మధ్య కాలంలో కోహ్లీ 213 మ్యాచ్‌లకు భారత్‌కు.. 2011-2023 మధ్య కాలంలో ఆర్సీబీకి 143 మ్యాచ్‌లకు నాయకత్వం వహించాడు.
short by / 10:52 pm on 06 May
భారత్‌తో ఉద్రిక్తతల మధ్య పాకిస్థాన్‌ కోరినట్లు UNSC రహస్య సమావేశం అనంతరం ఐక్యరాజ్యసమితిలో భారత మాజీ శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ తెలిపారు. "వారి [పాకిస్తాన్] అభిప్రాయాన్ని ఎవరూ పరిగణనలోకి తీసుకోరు" అని ఆయన అన్నారు. "ప్రపంచ దృష్టిని ఆకర్షించడానికి బహుపాక్షిక సంస్థలను ఉపయోగించుకోవాలనే పాకిస్థాన్‌ తపన కొత్తది కాదని ఆయన చెప్పారు.
short by / 11:03 pm on 06 May
ఇరాన్ మద్దతుగల హౌతీ తిరుగుబాటుదారులపై వైమానిక దాడులు ప్రారంభించిన తర్వాత యెమెన్ రాజధాని సనాలోని అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తిగా నిలిచిపోయిందని ఇజ్రాయెల్ సైన్యం మంగళవారం తెలిపింది. అక్కడ ఉన్న అనేక విద్యుత్ ప్లాంట్లు కూడా ధ్వంసమయ్యాయని పేర్కొంది. ఆదివారం టెల్ అవీవ్‌లోని బెన్ గురియన్ విమానాశ్రయంపై హౌతీ క్షిపణి దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ సదరు విమానాశ్రయంపై దాడి చేసింది.
short by / 11:46 pm on 06 May
సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలన్న భారత్ నిర్ణయంపై ప్రధాని మోదీ తొలిసారి మాట్లాడారు. "ఇదివరకు భారత్‌కు దక్కాల్సిన నీటి వాటా కూడా బయటకు వెళ్లిపోయేది. కానీ, ఇప్పుడు భారత జలాలు ఇక్కడే ప్రవహిస్తాయి. ఇక్కడే నిలుస్తాయి. ఇక్కడి ప్రయోజనాలు తీర్చుతాయి. మన దేశ జలాలు.. మన హక్కు," అని మోదీ ఓ కార్యక్రమంలో అన్నారు. కాగా పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాక్‌తో చేసుకున్న సింధు జల ఒప్పందాన్ని నిలిపివేసింది.
short by / 10:28 pm on 06 May
తమిళనాడులోని తంజావూరు సమీపంలో సోమవారం రాత్రి 38 ఏళ్ల బీజేపీ మహిళా కార్యకర్త బి.శరణ్య హత్య ఘటనపై పోలీసులు వివరాలు వెల్లడించారు. ఈ హత్యకు సంబంధించి శరణ్య సవతి కొడుకు సహా ముగ్గురు వ్యక్తులు మంగళవారం మధురైలో పోలీసుల ముందు లొంగిపోయారని పేర్కొన్నారు. ఈ హత్యకు రాజకీయ కోణం లేదని, కుటుంబ వివాదాల కారణంగానే ఇది జరిగిందని తెలిపారు. ఈ హత్యలో రాజకీయ కోణం ఉందని తొలుత ఆరోపణలు వచ్చాయి.
short by / 10:47 pm on 06 May
ప్రపంచంలోని కొన్ని దేశాలను పూర్తిగా సందర్శించేందుకు కొద్ది గంటలు మాత్రమే పడుతుందని నివేదికలు తెలిపాయి. వీటిలో యూరప్‌లోని లీచ్టెన్‌స్టెయిన్ ప్రపంచంలోని పురాతన గణతంత్ర రాజ్యం. శాన్ మారినో, ఫిజి (ఆస్ట్రేలియా), సోలమన్ ద్వీపం మధ్య ఉన్న చిన్న దేశం తువాలు, బీచ్‌లు, క్యాసినోలకు ప్రసిద్ధి చెందిన మొనాకో, ప్రపంచంలోని అతి చిన్న దేశం వాటికన్ నగరం ఉన్నాయి.
short by / 11:08 pm on 06 May
మైక్రోసాఫ్ట్ తన పదవీకాలంలో పనితీరు బాగాలేదని తేలిన మాజీ ఉద్యోగులను రెండేళ్ల పాటు తిరిగి నియమించుకోకుండా నిషేధిస్తున్నట్లు సమాచారం. మైక్రోసాఫ్ట్ ఇటీవల పనితీరు తక్కువగా ఉన్న దాదాపు 2,000 మంది ఉద్యోగులను తొలగించిందని బిజినెస్ ఇన్‌సైడర్ నివేదిక పేర్కొంది. తమ పనితీరుపైన తక్కువ రేటింగ్స్‌ వచ్చినవారికి ఈ నిబంధన అమలు చేయనుంది.
short by / 11:33 pm on 06 May
పహల్గాం ఉగ్రవాద దాడి దర్యాప్తులో జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు దాక్కున్న 70 ప్రదేశాలను ఏజెన్సీలు కనుగొన్నాయి. ఈ ప్రదశాలు కొండ అడవులలో, చెట్ల కింద, రాళ్ల మధ్య రంధ్రాలు తవ్వడం ద్వారా ముష్కరులు నిర్మించారు. ఈ రహస్య స్థావరాలలో రేషన్, దుప్పట్లను కనుగొన్నారు. వీటిన్నింటిని అధికారులు కూల్చివేశారు. మరోవైపు సైనిక సన్నద్ధతపై పరీక్ష కోసం బుధవారం దేశవ్యాప్తంగా మాక్‌ డ్రిల్‌ జరగనుంది.
short by / 12:15 am on 07 May
తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్‌లో పోప్‌గా ఉన్న చిత్రాన్ని షేర్ చేసిన తర్వాత, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. "నాకు దానితో సంబంధం లేదు, ఎవరో నేను పోప్ వేషంలో ఉన్న చిత్రాన్ని తీసి ఇంటర్నెట్‌లో పెట్టారు" అని అన్నారు. అది చేసింది తాను కాదని, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదని చెప్పారు. అంతకుముందు పోప్‌ ఎవరు కావాలనుకుంటున్నారనే ప్రశ్నకు "నేనే" అని ట్రంప్‌ సరదాగా వ్యాఖ్యానించారు.
short by / 12:18 am on 07 May
'విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ 2027 వన్డే ప్రపంచ కప్ ఆడతారా?' అనే ప్రశ్నకు భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ సమాధానం ఇచ్చారు. "ఇది వారిద్దరి వ్యక్తిగత నిర్ణయం. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో వారిద్దరూ ఎలాంటి ప్రదర్శన ఇచ్చారో ప్రపంచం మొత్తం చూసింది. వారు మెరుగైన ప్రదర్శన చేస్తున్నంత కాలం, భారత్ తరఫున ఆడుతూనే ఉంటారు" అని గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానించారు.
short by / 10:21 pm on 06 May
పహల్గాం ఉగ్రదాడిపై ప్రధాని నరేంద్ర మోదీ "కత్తులను సిద్ధం చేస్తున్నారని", కఠినంగా శిక్షిస్తామని హామీ ఇస్తున్నారని ది ఐరిష్ టైమ్స్ సంపాదకీయంలో పేర్కొనడంపై ఐర్లాండ్‌లో భారత రాయబారి అఖిలేష్ మిశ్రా స్పందించారు. దీనిని వింతగా అభివర్ణిస్తూ "అమాయక బాధితులకు అండగా ఉండేందుకు బదులుగా ఐరిష్ టైమ్స్ ఉగ్రవాదులను కాపాడేలా కాల్పులు జరిపేందుకు ఎంచుకుంది" అని మిశ్రా అన్నారు. సంపాదకీయంలో నిష్పాక్షికత లేదన్నారు.
short by / 10:33 pm on 06 May
ఎత్తైన భవనాలపైన ఎర్రటి లైట్లు ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం విమాన భద్రత. ఈ లైట్లను ఏవియేషన్‌ అబ్‌స్ట్రక్షన్‌ లేదా ఎయిర్‌ క్రాఫ్ట్ వార్నింగ్‌ లైట్లు అని అంటారు. రాత్రిపూట చీకటిలో, ముఖ్యంగా సరిగా కనిపించని సమయంలో విమానాలు సురక్షితంగా రాకపోకలు సాగించేలా చూడటమే దీని లక్ష్యం. ఈ లైట్లను పవర్ టర్బైన్లు, కమ్యూనికేషన్ టవర్లపై కూడా అమర్చుతారు. ఈ లైట్‌లు పైలట్‌లకు ఈజీగా కనిపిస్తాయి.
short by / 11:00 pm on 06 May
భారత్‌లోని తన కాన్సులేట్‌లలో వేలాది మంది విద్యార్థి వీసా స్లాట్‌లను US రాయబార కార్యాలయం విడుదల చేసింది. రాబోయే విద్యా సంవత్సరానికి ముందు సరైన సమయంలో ఈ చర్యలు చేపట్టింది. దేశవ్యాప్తంగా ఉన్న అభ్యర్థుల వీసా ప్రక్రియ సులభతరం చేయడమే దీని లక్ష్యం. దీనిద్వారా విద్యార్థులు తమ వీసాల దరఖాస్తులో జరిగే జాప్యాలు, చివరి నిమిషంలో వచ్చే ఇబ్బందులను నివారించడానికి రాయబార కార్యాలయం సహాయం చేస్తోంది.
short by / 10:15 pm on 06 May
పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత తటస్థ వేదికలతో సహా పాకిస్థాన్‌తో క్రికెట్ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాలని టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ పిలుపునిచ్చారు. "ఉగ్రవాదం ఆగనంత వరకు భారత్- పాకిస్థాన్ మధ్య ఎలాంటి సంబంధాలు ఉండకూడదు," అని గంభీర్ అన్నారు. కాగా ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది చనిపోయారు. ఆ తర్వాత భారత్-పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి.
short by / 10:29 pm on 06 May
2009 ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌తో ఆడిన తన తొలి అనుభవం గురించి భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపారు. "నా గుండె ఇన్నింగ్స్ అంతా చాలా వేగంగా కొట్టుకుంది" అని ఆయన చెప్పారు. "మనం ఆట ఓడిపోయినట్లు నాకు గుర్తుంది, నేను ఉదయం ఐదు గంటల వరకు మేల్కొని, పైకప్పు వైపు చూస్తూ ఇలాగే ఉండిపోయాను" అని ఆయన చెప్పారు. తాను సదరు మ్యాచ్‌లో 16 స్కోర్‌ చేసినట్లు పేర్కొన్నారు.
short by / 10:51 pm on 06 May
Load More
For the best experience use inshorts app on your smartphone