For the best experience use Mini app app on your smartphone
సోమవారం భారత సాయుధ దళాలు పాకిస్థాన్ మిరాజ్ ఫైటర్ జెట్‌ను ముక్కలు ముక్కలుగా పేల్చేసిన ఫొటో, వీడియో విడుదల చేశాయి. మే 7 నుంచి 10 వరకు పాకిస్థాన్ ప్రయోగించిన.. లక్ష్యాన్ని ఢీకొట్టడంలో విఫలమైన చైనా క్షిపణి, ఇతర ఆయుధాల చిత్రాలను షేర్ చేశాయి. భారత్ ధ్వంసం చేసిన వాటిలో దీర్ఘ శ్రేణి రాకెట్లు, టర్కిష్ డ్రోన్లు కూడా ఉన్నాయి. పాక్ సైనిక స్థావరాలు, ఎయిర్‌క్రాఫ్ట్‌లను ధ్వంసం చేసిన తీరును ఆర్మీ వివరించింది.
short by Devender Dapa / 06:28 pm on 12 May
ఆపరేషన్‌ సిందూర్‌ గురించి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ పహల్గాం ఉగ్రదాడి బాధితుల క్షోభను గుర్తు చేసుకుంటూ కన్నీరు పెట్టుకున్నారు. “సెలవులను ఆస్వాదిస్తున్న అమాయక ప్రజలను మతం అడిగి వాళ్ల కుటుంబ సభ్యుల ముందే, పిల్లల ముందే చంపేశారు. ఇది చాలా క్రూరం. దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీయాలనుకున్నారు. వ్యక్తిగతంగా ఇది నాపై చాలా ప్రభావం చూపింది” అని ఆయన ఉద్వేగం నిండిన కళ్లతో తెలిపారు.
short by Sharath Behara / 08:19 pm on 12 May
పాకిస్థాన్‌లో సోమవారం 4.6 తీవ్రతతో భూకంపం సంభవించిందని నివేదికలు తెలిపాయి. అయితే శనివారం అంటే మే 10వ తేదీన కూడా పాకిస్థాన్‌లో 5.7, 4.0 తీవ్రతతో వరుసగా 2 భూకంపాలు సంభవించడం గమనార్హం. పాకిస్థాన్‌లో 3 రోజుల వ్యవధిలో 3 భూకంపాలు నమోదు కావడంపై ‘X’ వినియోగదారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ‘అణు పరీక్షలు చేయడంతోనే ఇలా జరుగుతోందా?’ అని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై నిపుణులు, అధికారులు స్పందించలేదు.
short by Devender Dapa / 06:12 pm on 12 May
పాకిస్థాన్‌లోని 2 కీలక సైనిక లక్ష్యాలపై దాడి చేసిన దృశ్యాలను భారత సైన్యం షేర్ చేసింది. రావల్పిండిలోని నూర్ ఖాన్ వైమానిక స్థావరం, పాకిస్థాన్‌ పంజాబ్‌లోని రహీమ్ యార్ ఖాన్ వైమానిక స్థావరాలు ఇందులో ఉన్నాయి. అయితే భారత సైన్యం దాడిలో నూర్ ఖాన్ వైమానిక స్థావరంలోని రన్‌వేపై భారీ గొయ్యి ఏర్పడినట్లు వీడియోలో కనిపించింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ మే 7న ‘ఆపరేషన్ సిందూర్‌’ ప్రారంభించింది.
short by Devender Dapa / 07:19 pm on 12 May
భారత సాయుధ దళాలు ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసి, ఆకాశంలో పాకిస్థాన్ డ్రోన్‌లను ధ్వంసం చేసిన తర్వాత పాకిస్థాన్‌ ఇతర దేశాల వద్దకు వెళ్లి కాల్పుల విరమణ కోసం వేడుకుందని ప్రధాని మోదీ అన్నారు. భారత సాయుధ దళాల దాడులకు బెదిరిపోయి పాకిస్థాన్ డీజీఎంవో భారత డీజీఎంవోను కాల్పుల విరమణ కోసం సంప్రదించారని చెప్పారు. ప్రతీసారి తాము యుద్ధాల్లో పాకిస్థాన్‌ను ఓడించామని జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో మోదీ వెల్లడించారు.
short by Devender Dapa / 08:47 pm on 12 May
ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు భారీగా పెరగుతుండటంతో జనం తీవ్ర ఉక్కపోతతో అల్లాడుతున్నారు. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండతీవ్రత పెరుగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ పేర్కోన్నారు. సోమవారం పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కాకానిలో 43.7°C గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా, 17 జిల్లాల్లో 41°Cకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డైనట్లు వెల్లడించారు.
short by / 06:07 pm on 12 May
ఆర్థిక నష్టాల మధ్య జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం నిస్సాన్ మోటార్ 10,000 ఉద్యోగాలను తగ్గించనుంది. చివరి రౌండ్ తొలగింపులు 10,000 మంది ఉద్యోగులను ప్రభావితం చేస్తాయని కంపెనీ గతంలో ప్రకటించింది. మొత్తంగా, నిస్సాన్ తొలగింపులు 20,000 మంది ఉద్యోగులను ప్రభావితం చేస్తాయి, అయితే ఇది $5 బిలియన్ల వరకు ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటోంది.
short by / 05:53 pm on 12 May
భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో సెన్సెక్స్ సోమవారం దాదాపు 3000 పాయింట్లు పెరిగి 82,429.90 వద్ద ముగిసింది. ఈ సమయంలో BSEలోని ఇన్ఫోసిస్ (7.91%), HCL (6.35%), టాటా స్టీల్ (6.16), ఎటర్నల్ (5.68%), టెక్ మహీంద్రా (5.36%), TCS (5.17%) షేర్లలో గరిష్ట లాభాలు కనిపించాయి. అదే సమయంలో సన్ ఫార్మా, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు వరుసగా 3.36% & 3.57% క్షీణించాయి.
short by / 06:29 pm on 12 May
విరాట్‌ కోహ్లీ ఆధునిక కాలపు లెజెండ్‌ అని భారత మాజీ కోచ్‌ రవిశాస్త్రి అన్నారు. టెస్ట్ క్రికెట్ నుంచి కోహ్లీ రిటైర్మెంట్ కావడంపై ఆయన స్పందించారు. "మీరు రిటైర్ అయ్యారంటే నేను నమ్మలేకపోతున్నాను. మీరు ఆడిన ఆట, కెప్టెన్‌గా వ్యవహరించిన విధానం మిమ్మల్ని టెస్ట్ క్రికెట్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా మార్చింది. అందరికీ, ముఖ్యంగా నాకు మీరు ఇచ్చిన జ్ఞాపకాలకు ధన్యవాదాలు" అని రవిశాస్త్రి పేర్కొన్నారు.
short by / 07:18 pm on 12 May
భారతదేశానికి వ్యతిరేకంగా టర్కిష్ డ్రోన్ల వినియోగం గురించి ఆపరేషన్ సిందూర్‌పై ప్రెస్ మీట్‌లో భాగంగా ఒక జర్నలిస్ట్ ప్రశ్నించారు. దీనిపై సైన్యం స్పందిస్తూ, "అవి టర్కిష్ డ్రోన్లు అయినా లేదా ఇతర ఏ ప్రాంతాల నుంచి వచ్చిన డ్రోన్లు అయినా, మా కౌంటర్ సిస్టమ్స్, మా రక్షణ ఆపరేటర్లు వాటిని ఎదుర్కోగల సామర్థ్యం కలిగి ఉన్నారు, అంతకుమించి పెద్దగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు," అని పేర్కొంది.
short by / 05:56 pm on 12 May
"మా అన్ని సైనిక స్థావరాలు, అన్ని రక్షణ వ్యవస్థలు కార్యాచరణలో ఉన్నాయి. అవసరమైతే తదుపరి మిషన్‌కు సిద్ధంగా ఉన్నాయి," అని ఎయిర్ మార్షల్ ఏకే భారతి సోమవారం విలేకరులకు తెలిపారు. పాకిస్థాన్, పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలను భారతదేశం లక్ష్యంగా చేసుకున్న తర్వాత, పాకిస్థాన్ భారత సైనిక స్థావరాలపై దాడి చేయడానికి ప్రయత్నించడం గమనార్హం.
short by / 06:00 pm on 12 May
'ఆపరేషన్ సిందూర్'పై ప్రెస్ మీట్ సందర్భంగా DGMO లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ మాట్లాడుతూ, "గత కొన్నేళ్లుగా ఉగ్రవాద కార్యకలాపాల స్వభావం మారుతోంది, ఇప్పుడు మన సైన్యంతో పాటు, అమాయకులు కూడా దాడికి గురువుతున్నారు," అని తెలిపారు. "2024లో శివఖోడి ఆలయానికి వెళ్లే యాత్రికులు, ఈ ఏడాది ఏప్రిల్‌లో పహల్గాంలో అమాయక పర్యాటకులు... ఇలా పహల్గాం దాడితో పాక్ ఉగ్రవాదుల పాపాల గిన్నె నిండిపోయింది," అని ఆయన పేర్కొన్నారు.
short by / 06:13 pm on 12 May
భారత ఆర్మీ ప్రెస్ కాన్ఫరెన్స్‌ను కాపీ చేసిందని ఆస్ట్రేలియన్ మీడియా పాకిస్థాన్ ఆర్మీని ట్రోల్ చేసింది. "సిర్సా నుంచి దిల్లీ వరకు దాడులు నిర్వహించామంటూ పాకిస్ఖాన్ సైన్యం విలేకరుల సమావేశం నిర్వహించింది, అయితే దానికి సంబంధించిన ఎలాంటి రుజువులను చూపించలేకపోయింది," అని ఒక మీడియా సంస్థ పేర్కొంది.
short by / 06:25 pm on 12 May
బ్రిటన్‌కు వచ్చే వచ్చేవారు అక్కడే ఉండాలనుకుంటే ఇంగ్లీష్‌ భాషనే మాట్లాడాలని ఆ దేశ ప్రధానమంత్రి కీర్‌ స్టార్మర్‌ తెలిపారు. కాబట్టే తమ దేశానికి వలస వచ్చేవారిలో ఇంగ్లీష్‌ భాషా నైపుణ్యాలను గమనిస్తున్నామని చెప్పారు. "ఇది కామన్‌ సెన్స్‌" అని ఆయన అన్నారు. ప్రధానంగా బ్రిటన్‌ నూతన వలస విధానం ప్రకారం ఐదేళ్లు నివాసముంటే ఇచ్చే పౌరసత్వ హక్కులను పదేళ్లకు పెంచారు.
short by / 07:33 pm on 12 May
అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో వీధుల్లో పావురాలకు ఆహారం పెట్టడం చట్టవిరుద్ధం. ఇక్కడ పక్షులు వ్యాధులను వ్యాప్తి చేసేందుకు, ఆస్తికి నష్టం కలిగించడానికి బాధ్యత వహిస్తాయి. ఇక్కడ, పావురాలకు ఆహారం పెడుతూ దొరికితే భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. పావురాలకు ఆహారం పెడుతున్న వారి గురించి పోలీసులకు సమాచారం ఇచ్చిన వారికి ప్రోత్సాహకాలు అందిస్తారు.
short by / 07:54 pm on 12 May
భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో స్టాక్ మార్కెట్ సోమవారం భారీ పెరుగుదలను చూసింది. సెన్సెక్స్ దాదాపు 3000 పాయింట్లు పెరిగి 82,429 వద్ద ముగియగా, నిఫ్టీ-50 కూడా 916.70 పాయింట్లు పెరిగి 24,924కి చేరుకుంది. గత 4 ఏళ్లలో ఇది అతిపెద్ద సింగిల్-డే ర్యాలీ. BSE-లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.16 లక్షల కోట్లు పెరగడంతో మొత్తం మార్కెట్ క్యాప్ $5 ట్రిలియన్ల మార్కును అధిగమించింది.
short by / 05:44 pm on 12 May
36 ఏళ్ల విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. బీసీసీఐ పట్ల అసంతృప్తి, ఫామ్‌లేమి, ఆస్ట్రేలియా పర్యటనలో ఆశించిన మేర రాణించకపోవడం, పనిభారం కారణంగానే అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు నివేదికలు తెలిపాయి. ఇదే సమయంలో రోహిత్ శర్మ టెస్టు క్రికెట్ నుంచి తప్పుకున్నాక ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు భారత కెప్టెన్‌గా ఉండాలని కోహ్లీ బావించాడని, కానీ బీసీసీఐ నిరాకరించిందని పేర్కొన్నాయి.
short by / 05:51 pm on 12 May
గత 5 ఏళ్లలో మంచి పనితీరు కనబరిచిన రక్షణ స్టాక్‌లలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్-HAL, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్-BEL ఉన్నాయి. HAL & BEL కేవలం 5 సంవత్సరాలలో పెట్టుబడిదారులకు 14 రెట్ల రాబడిని అందించాయి. 2020లో ఈ 2 షేర్లలో రూ.1 లక్ష పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్ల విలువ నేడు రూ.14 లక్షలకు పెరిగింది.
short by / 06:17 pm on 12 May
వడ్డీ రేటును ప్రభావితం చేసే ప్రధాన అంశాల్లో ఒకటి క్రెడిట్ స్కోరు. ఇది 750 కంటే ఎక్కువగా ఉంటే తక్కువ వడ్డీ రేటుకు వ్యక్తిగత రుణం పొందే అవకాశాలు పెరుగుతాయి. అటువంటి పరిస్థితిలో, మీ క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపరచుకోండి. అదనంగా, సకాలంలో EMIలు చెల్లించడం, మీ అప్పు-ఆదాయ నిష్పత్తిని తగ్గించండి. బేరసారాలు చేయడం వల్ల కూడా వడ్డీ రేట్లలో తగ్గింపును పొందవచ్చు.
short by / 08:03 pm on 12 May
తన భర్త, భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంపై నటి అనుష్క శర్మ స్పందించారు. "అందరూ రికార్డులు, మైలురాళ్ల గురించే మాట్లాడతారు. కానీ నీవు దాచుకున్న కన్నీళ్లు, బయటకు తెలియకుండా నీతో నువ్వు చేసిన యుద్ధాలు గుర్తుండిపోతాయి. ఏదో ఒక రోజు టెస్టుల నుంచి రిటైర్ అవుతావని తెలుసు. కానీ, నువ్వు ఎల్లప్పుడూ నీ మనసు చెప్పిన ప్రకారమే నిర్ణయం తీసుకుంటావు," అని పోస్టు పెట్టారు.
short by / 05:54 pm on 12 May
విరాట్ కోహ్లీ 8 అత్యుత్తమ టెస్ట్ ఇన్నింగ్స్‌ల జాబితాను ఐసీసీ విడుదల చేసింది. వీటిలో 2013 (దక్షిణాఫ్రికా)లో చేసిన 119 & 96 పరుగుల ఇన్నింగ్స్‌లు, 2014 (ఆస్ట్రేలియా)లో చేసిన 115 & 141 పరుగులు, 2016 (ఇంగ్లాండ్)లో చేసిన 235 పరుగులు, 2018 (ఇంగ్లాండ్)లో చేసిన 149 పరుగులు, 2018 (దక్షిణాఫ్రికా)లో చేసిన 153 పరుగులు, 2019 (దక్షిణాఫ్రికా)లో చేసిన 254 పరుగులు ఉన్నాయి.
short by / 06:19 pm on 12 May
S-500 వ్యవస్థ అనేది బహుళ లక్ష్యాలు ఛేదించగల, అంతరిక్ష రక్షణ సామర్థ్యం కలిగిన బహుళ లేయర్లతో ఉండే గగనతల రక్షణ వ్యవస్థ. దీనితో శత్రు యుద్ధ విమానాలు, క్రూయిజ్ క్షిపణులు, హైపర్‌ సోనిక్‌ క్షిపణులు, భూమి దిగువ కక్ష్యలో ఉన్న ఏవైనా ఇతర ఆయుధాలు, శత్రు ఉపగ్రహాలను కూల్చివేయవచ్చు. 600 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలు ఛేదించగలిగే ఏకైక రక్షణ వ్యవస్థ. దీనికి ఒకేసారి 10కి పైగా లక్ష్యాలపై దాడులు చేసే సామర్థ్యం ఉంది.
short by / 08:42 pm on 12 May
విరాట్ కోహ్లీ టెస్టుల నుంచి తప్పుకోవాలనే నిర్ణయం ఫామ్ కోల్పోవడం వల్ల ప్రభావితమై ఉండవచ్చనే విశ్లేషణలు ఉన్నాయి. 2011 నుంచి 2019 మధ్య కోహ్లీ సగటు దాదాపు 55 ఉండగా, గత రెండేళ్లలో అది 32.56 కి పడిపోయింది. మానసిక అలసట తనను రిటైర్మెంట్ వైపు ఆలోచించేలా చేస్తుందని గతంలో విరాట్ కోహ్లీ చెప్పాడు. తాను ఎంత వరకు చేయగలనో అంతవరకూ క్రికెట్‌ కోసం చేశానని రిటైర్మెంట్ ప్రకటనలో కోహ్లీ పేర్కొన్నాడు.
short by / 09:15 pm on 12 May
విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని తనకు ప్రాణ హాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. చక్రవర్తి కడియాల అనే వ్యక్తి తనకు ఫోన్‌ చేసి చంపేస్తానని బెదిరిస్తూ అసభ్యకరమైన పదజాలంతో తనను దూషించాడని ఆయన పేర్కొన్నారు. తన ఆస్తికి కూడా నష్టం కలిగించాడని చెప్పారు. అయితే నాని తన సోదరుడు కేశినేని చిన్ని రూ.3,200 కోట్ల మద్యం కుంభకోణంలో పాల్గొన్నారని ఆరోపిస్తూ, ఈడీ దర్యాప్తు కోరిన అనంతరం ఇది జరిగింది.
short by / 09:16 pm on 12 May
భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, ఆయన కుమార్తెపై ట్రోలింగ్‌ను, ఆమె ఫోన్ నంబర్ లీక్ చేయడాన్ని జాతీయ మహిళా కమిషన్-NCW తీవ్రంగా ఖండించింది. "ఇది వారి గోప్యతను తీవ్రంగా ఉల్లంఘించడమే కాక వారి భద్రతను ప్రమాదంలో పడేస్తుంది," అని కమిషన్ పేర్కొంది. "సీనియర్-మోస్ట్ సివిల్ సర్వెంట్ కుటుంబంపై ఇలాంటి వ్యక్తిగత దాడులు ఆమోదయోగ్యం కాదు, క్షమించరానివి కూడా," అని కమిషన్ తెలిపింది.
short by / 05:49 pm on 12 May
Load More
For the best experience use inshorts app on your smartphone