సుఖోయ్ Su-57 అనేది 5వ తరం యుద్ధ విమానం. దీనిని భారత్‌లో దేశీయంగా ఉత్పత్తి చేసేందుకు రష్యా ముందుకొచ్చింది. జంట ఇంజిన్లు కలిగిన ఈ విమానం రాడార్‌లో కనిపించడాన్ని తగ్గించే స్టెల్త్ టెక్నాలజీని కలిగి ఉంది. అధునాతన క్షిపణులు, ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థలు కలిగిన ఈ విమానం ధ్వని కంటే 2 రెట్లు వేగంతో మాక్ 2 వద్ద ప్రయాణిస్తుంది. ఈ విమానం అధునాతన ఏవియానిక్స్, సూపర్‌సోనిక్ క్రూయిజ్ సామర్థ్యాన్ని అందిస్తుంది.
short by
/
11:04 am on
21 Nov