భారత్‌కి చెందిన మనికా విశ్వకర్మ మిస్ యూనివర్స్ 2025 పోటీల్లో టాప్ 12లో చోటు దక్కించుకోలేక టైటిల్ రేసు నుంచి నిష్క్రమించారు. 22 ఏళ్ల ఈమె స్విమ్‌సూట్ రౌండ్‌లో (టాప్ 30) ఎలిమినేట్ అయ్యారు. దీంతో భారత్‌కు ఈ ఏడాది మిస్ యూనివర్స్ కిరీటం చేజారింది. ఈ పోటీల్లో మెక్సికోకు చెందిన ఫాతిమా బాష్ కిరీటాన్ని గెలిచారు. కాగా, భారత్ నుంచి చివరిసారిగా 2021లో హర్నాజ్ కౌర్ సంధు మిస్ యూనివర్స్ టైటిల్ నెగ్గారు.
short by
/
10:30 am on
21 Nov