అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు GHMC నోటీసులు జారీ చేసింది. చూపించిన వ్యాపార విస్తీర్ణం కంటే చాలా ఎక్కువ భూభాగం ఉన్నట్లు గుర్తించామని పేర్కొంది. అన్నపూర్ణ స్టూడియోస్ 1.92 లక్షల చదరపు అడుగులు వినియోగిస్తూనే కేవలం 8,100 అడుగులకే ట్యాక్స్ చెల్లించినట్లు చెప్పింది. రామానాయుడు స్టూడియోస్ 68,000 అడుగుల్లో పనిచేస్తూ 1,900 అడుగులకే ఫీజు చెల్లించడంతో పూర్తి ట్రేడ్ లైసెన్స్ కట్టాలని GHMC హెచ్చరించింది.
short by
/
10:31 am on
21 Nov