For the best experience use Mini app app on your smartphone
నవంబర్ 22 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడొచ్చని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. ఇది ఈనెల 24వ తేదీకల్లా వాయుగుండంగా, ఆ తదుపరి 48 గంటల్లో తుపానుగా మారి నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశించి ఆంధ్రప్రదేశ్‌ తీరం వైపు రావచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. దీంతో ఈ నెల 27 నుంచి 29 వరకు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది.
short by srikrishna / 08:57 am on 21 Nov
For the best experience use inshorts app on your smartphone