‘మీసేవ’ ద్వారా అందించే 38 ప్రభుత్వ విభాగాలకు చెందిన 580కి పైగా పౌరసేవలను తెలంగాణ ప్రభుత్వం వాట్సప్ ద్వారా అందుబాటులోకి తెచ్చింది. దీనికోసం మెటా, ‘మీసేవ’ సంయుక్త భాగస్వామ్యంలో రూపొందించిన ‘మీసేవ సర్వీసెస్ ఆన్ వాట్సప్’ను మంగళవారం మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించారు. ప్రజలు 8096958096 నంబర్‌ను సేవ్ చేసుకుని వాట్సప్ ద్వారా ‘మీసేవ’ సేవలను పొందొచ్చు. ప్రస్తుతం ఈ సేవలు ఆంగ్లంలోనే అందుబాటులో ఉన్నాయి.
short by
srikrishna /
08:29 am on
19 Nov