నెల్లూరు జిల్లా సంగం వద్ద రన్నింగ్‌లో ఉన్న ఆర్టీసీ బస్సు కింద భాగంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఇది గమనించిన కానిస్టేబుల్ నాగార్జున తన బైక్‌పై ముందుకు వెళ్లి డ్రైవర్‌ను అప్రమత్తం చేశారు. వెంటనే బస్సు నిలిపిన డ్రైవర్, మొత్తం 45 మంది ప్రయాణికులను క్షేమంగా కిందకు దించడంతో ప్రమాదం తప్పింది. ఇంజన్ ఆపేయడంతో మంటలు ఆగిపోయాయి. ప్రయాణికులు.. కానిస్టేబుల్ నాగార్జునకు అభినందనలు తెలిపారు.
short by
Devender Dapa /
11:48 pm on
18 Nov