నటుడు ఎన్టీఆర్ అభిమానులకు ప్రభాస్ ‘రాజాసాబ్’ దర్శకుడు మారుతి క్షమాపణ చెప్పారు. ఇటీవల సాంగ్ లాంఛ్ ఈవెంట్‌లో మారుతి, “కాలర్ ఎగరేసుకుంటారని నేను చెప్పను. ఎందుకంటే ప్రభాస్ కటౌట్ ముందు ఆ మాటలు చిన్నవి అవుతాయి,” అన్నారు. గతంలో ఎన్టీఆర్ ‘వార్ 2’ విడుదలపుడు కాలర్ ఎగరేశారని, మారుతి ఆయనను ఉద్దేశించే మాట్లాడాడని నెటిజన్లు పోస్టులు పెట్టారు. ఉద్దేశపూర్వకంగా తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని మారుతి వివరణ ఇచ్చారు.
short by
Devender Dapa /
03:53 pm on
24 Nov