‘గేమ్‌ఛేంజర్’లో తన పాత్ర నిడివి ఏంటో తెలుసని, శంకర్ దర్శకత్వంలో నటించాలనే ఉద్దేశంతోనే సినిమా ఒప్పుకొన్నానని నటుడు ప్రియదర్శి అన్నారు. “గేమ్ ఛేంజర్‌లో నేను చాలా సీన్స్ చేశా. అవన్నీ ఎడిటింగ్‌లో పోయాయి. నా పాత్ర చిన్నదని నాకు ముందే తెలుసు. నేను 25 రోజులు పనిచేశా. 2 నిమిషాలు కూడా కనిపించను. శంకర్ నాతో వ్యక్తిగతంగా సినిమా చేయకపోవచ్చు. కానీ, నాకైతే ఆయనతో పనిచేసే అవకాశం లభించింది కదా,” అని తెలిపారు.
short by
Devender Dapa /
11:32 pm on
11 Mar