గర్ల్‌ఫ్రెండ్ స్వాపింగ్ రాకెట్‌ను బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ఛేదించి, ఇద్దరు నిందితులను అరెస్టు చేసింది. విచారణలో భాగంగా నిందితుల సెల్‌ఫోన్లలో పలువురు అమ్మాయిల అసభ్య చిత్రాలు, వీడియోలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ అశ్లీల ఫొటోలు, వీడియోలతో యువతులను బెదిరిస్తూ ఇతరులతో సంబంధాలు పెట్టుకోవాలని నిందితులు బలవంతం చేసేవారని పోలీస్ అధికారి తెలిపారు. ఓ యువతి ఫిర్యాదుతో ఈ విషయం బయటపడింది.
short by
Rajkumar Deshmukh /
02:00 pm on
21 Dec