‘దిత్వా’ తుపాను ప్రభావంతో నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం పడుతోంది. నెల్లూరులోని పేరారెడ్డిపల్లి, బీసీ కాలనీల్లోని ఇళ్లలోకి వరద చేరింది. సైదాపురం మండలంలో పిన్నేరు వాగు కాజ్‌వేపై వరద ప్రవహిస్తోంది. తిరుపతి జిల్లాలోని బాలాయపల్లిలో 10.8 సెం.మీ, డక్కిలిలో 11.2 సెం.మీ వర్షపాతం నమోదైంది. గూడూరు డివిజన్‌లోని 14 మండలాల పరిధిలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.
short by
Devender Dapa /
03:36 pm on
04 Dec