పల్నాడు జిల్లా నరసరావుపేటలో సైబర్ నేరగాళ్లు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిని బెదిరించి రూ.11 లక్షలు కాజేశారు. ఐటీ ఉద్యోగినికి ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు, ఆన్‌లైన్‌లో గంజాయి కొన్నట్టు ఆధారాలు ఉన్నాయని బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. అరెస్టు చేసేందుకు పోలీసులు వస్తున్నారని బెదిరించడంతో ఆమె భయపడి ఆన్‌లైన్‌లో రూ.11 లక్షలు చెల్లించిందని చెప్పారు. ఆ తర్వాత బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
short by
Devender Dapa /
11:20 pm on
01 Feb