అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' సినిమాకు వెళదాం అంటే తన ప్రియుడు ఒప్పుకోలేదని ఉత్తరప్రదేశ్ వారణాసిలో 22 ఏళ్ల యువతి తాము ఉంటున్న హోటల్ మూడో అంతస్తు నుంచి దూకింది. బనారస్ హిందూ యూనివర్శిటీ అనుబంధ కళాశాలలో చదువుతున్న ఆ యువతి తన ప్రియుడితో కలిసి ట్రిప్ కోసం వారణాసి వెళ్లిన సమయంలో ఇది జరిగింది. ప్రస్తుతం ఆ యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. పోలీసులు ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు.
short by
Sri Krishna /
12:15 pm on
21 Dec