పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంలతో మాట్లాడారని ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ ANI నివేదించింది. ఆయా రాష్ట్రాల్లోని పాకిస్థానీలను గుర్తించి, తిరిగి వాళ్ల దేశానికి పంపించాలని అమిత్ షా సీఎంలను ఆదేశించారని సమాచారం. ఇప్పటికే పాకిస్థాన్ పౌరులకు జారీ చేసిన వీసాలను నిలిపివేసిన భారత్, ఆ వీసాలు ఉన్నవారంతా ఈనెల 27లోగా దేశం విడిచి వెళ్లిపోవాలని తెలిపింది.
short by
Devender Dapa /
02:41 pm on
25 Apr