ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తర్వాత తన ఫొటోలు వైరల్‌గా మారడం వల్ల తనకు ఎదురైన చేదు అనుభవాలను సినీ నటి గిరిజా ఓక్ తాజాగా వెల్లడించారు. తనకు సోషల్ మీడియాలో అసభ్యకర సందేశాలు వచ్చాయని చెప్పారు. 'మీతో ఒక గంట గడపడానికి ఎంత ఖర్చవుతుంది?' అంటూ ఒకరు తన రేటు అడిగారని ఆమె తెలిపారు. "ఇలాంటి సందేశాలు చాలా ఉన్నాయి,” అని 37 ఏళ్ల గిరిజా అన్నారు. ఆమె ‘షోర్ ఇన్ ది సిటీ' అనే చిత్రంలో సందీప్ కిషన్ సరసన నటించారు.
short by
srikrishna /
01:27 pm on
26 Nov