తనకు కస్టమర్ ఇవ్వాల్సిన రూ.10 బకాయి చెల్లించడం లేదంటూ ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌లో జితేంద్ర అనే దివ్యాంగుడు పోలీసులకు ఫోన్‌లో ఫిర్యాదు చేశాడు. తాను ఏడాదిన్నర క్రితం సంజయ్‌కు రూ.10 విలువైన గుట్కా ప్యాకెట్‌ను అప్పుగా ఇచ్చానని, ఎన్నిసార్లు అడిగినా డబ్బులు ఇవ్వకపోవడంతో విసిగిపోయి పోలీస్ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేశానని జితేంద్ర పేర్కొన్నాడు. పోలీసులకు ఫోన్ చేశాక సంజయ్ డబ్బులిచ్చినట్లు జితేంద్ర తెలిపారు.
short by
Rajkumar Deshmukh /
09:01 pm on
03 Dec