For the best experience use Mini app app on your smartphone
తెలంగాణలో ట్రాఫిక్ చలాన్ల మాఫీపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తూ రాచకొండ ట్రాఫిక్ పోలీసులు ప్రకటన విడుదల చేశారు. 100% ట్రాఫిక్ చలాన్ల మాఫీ ప్రచారం అవాస్తవమన్నారు. సోషల్‌ మీడియా వీడియోలు, ఫార్వర్డ్‌ మెసేజ్‌లు నమ్మవద్దని కోరారు. ట్రాఫిక్‌ చలాన్ల మాఫీపై పోలీసులు, లోక్‌ అదాలత్‌ ఎలాంటి నోటిఫికేషన్‌ ఇవ్వలేదన్నారు. డిసెంబర్ 13న ట్రాఫిక్ చలాన్లు కడితే 100% వరకు రాయితీ ఇస్తున్నారని తొలుత ప్రచారం జరిగింది.
short by Devender Dapa / 02:32 pm on 04 Dec
For the best experience use inshorts app on your smartphone