For the best experience use Mini app app on your smartphone
మహారాష్ట్రలోని నైగావ్‌లో వ్యభిచార ముఠా నుంచి బంగ్లాదేశ్‌కు చెందిన 12 ఏళ్ల బాలికను పోలీసులు రక్షించారు. 3 నెలల్లో కనీసం 200 మంది పురుషులు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు చెప్పింది. పాఠశాలలో ఓ సబ్జెక్ట్‌లో ఫెయిల్‌ కావడంతో తల్లిదండ్రులకు భయపడి ఆ బాలిక ఇంటి నుంచి పారిపోగా, ఆమెను పరిచయస్థురాలైన ఓ మహిళ భారత్‌కి తీసుకొచ్చి వ్యభిచారంలోకి దించింది. ఈ కేసులో ఇప్పటివరకు 10 మందిని అరెస్టు చేశారు.
short by srikrishna / 09:08 am on 12 Aug
For the best experience use inshorts app on your smartphone