వ్యభిచారం చేయాలని తన కన్న తల్లి, పొరుగింటి వ్యక్తి కలిసి తనపై ఒత్తిడి తెస్తున్నారంటూ ముంబైలో పదో తరగతి చదివే 16 ఏళ్ల బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆ ఇద్దరిపై కేసు నమోదైంది. ఏప్రిల్ నుంచి వారిద్దరూ వ్యభిచారం చేయమని తనను బలవంతం చేశారని, డబ్బు సంపాదనకు ఇదే సరైన మార్గమని చెప్పేవారని ఆ బాలిక తెలిపింది. బాధితురాలు తొలుత తన స్కూల్ టీచర్‌కి ఈ విషయం చెప్పడంతో ఇది వెలుగులోకి వచ్చింది.
short by
srikrishna /
03:45 pm on
27 Nov