GHMCలో 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు విలీనం చేయాలని తెలంగాణ కేబినెట్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌లకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సోమవారం ఆమోదం తెలిపారు. GHMC, మున్సిపాలిటీల చట్టాల సవరణ ఆర్డినెన్సులకు ఆమోద ముద్ర వేశారు. ఈ విలీన ప్రక్రియ ముగిశాక, 5 జిల్లాలు, 47 మండలాలు, 311 గ్రామాల పరిధిలో 6 పార్లమెంటు స్థానాలు, 28 అసెంబ్లీ స్థానాలతో దేశంలోనే అతి పెద్ద నగరంగా హైదరాబాద్ విస్తరించనుంది.
short by
Devender Dapa /
11:21 pm on
01 Dec