నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలంలో 35 ఏళ్ల వివాహితను ఆర్‌ఎంపీ వైద్యుడు మహేశ్ ఆదివారం తన కారులో ఎక్కించుకుని రేప్ చేసి, తర్వాత ఆమె చేతులకు గడ్డి మందు ఇంజెక్ట్ చేశాడని పోలీసులు తెలిపారు. బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం వేకువజామున చనిపోయారు. మహేశ్ చేసిన ఘాతుకం గురించి ఆమె చనిపోయే ముందు వైద్యులకు వివరిస్తున్న వీడియో వెలుగులోకి వచ్చింది. వీరిద్దరి మధ్య వివాహేతర బంధం ఉన్నట్లు సమాచారం.
short by
srikrishna /
10:23 am on
01 Jul