For the best experience use Mini app app on your smartphone
‘అఖండ 2’ సినిమాను 3డీ లోనూ రిలీజ్‌ చేయనున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. ‘’బాలకృష్ణ అభిమానులు, ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఈ సినిమాను 3డీ ఫార్మాట్‌లోనూ తీసుకొస్తున్నాం,’’ అని దర్శకుడు బోయపాటి శ్రీను ఆదివారం చెప్పారు. ఈ చిత్రాన్ని సనాతన ధర్మం ఆధారంగా రూపొందిస్తున్నట్లు తెలిపారు. 2021 లో వచ్చిన ‘అఖండ’కు సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ డిసెంబరు 5న విడుదల కానుంది.
short by srikrishna / 01:47 pm on 16 Nov
For the best experience use inshorts app on your smartphone