26ఏళ్ల రాజేశ్ తన తల్లి స్నేహితురాలైన 46 ఏళ్ల కమలను చంపి, మృతదేహాన్ని కారు డిక్కీలో పెట్టుకుని వెళ్తుండగా పోలీసులు పట్టుకున్న ఘటన నిజామాబాద్ రూరల్ ఠాణా పరిధిలో శుక్రవారం జరిగింది. తన తల్లి పద్మ రమ్మంటుందని కమలకు రాజేశ్ ఫోన్ చేసి పొలాల్లోకి రప్పించి, బండరాయితో కొట్టి చంపినట్టు పోలీసులు గుర్తించారు. తన తల్లిని వ్యభిచారానికి ప్రేరేపించిందనే కమలను చంపానని రాజేశ్ పోలీసులకు చెప్పాడు.
short by
srikrishna /
05:33 pm on
29 Mar