For the best experience use Mini app app on your smartphone
నటుుడు విజయ్‌ సేతుపతి- దర్శకుడు పూరీ జగన్నాథ్‌ కలయికలో రూపొందుతున్న సినిమా షూటింగ్‌ పూర్తయినట్లు చిత్రబృందం సోమవారం తెలిపింది. పూరి జగన్నాథ్‌ను మిస్‌ అవుతానని సేతుపతి చెబుతున్న వీడియోను నిర్మాణ సంస్థ షేర్‌ చేసింది. ‘పూరి సేతుపతి’గా ప్రచారంలో ఉన్న ఈ సినిమా షూటింగ్‌ను జులై మొదటి వారంలో ప్రారంభించి, 5 నెలల్లోనే పూర్తి చేశారు. ఈ చిత్రానికి ‘బెగ్గర్‌’ టైటిల్‌ పరిశీలనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
short by srikrishna / 11:09 am on 24 Nov
For the best experience use inshorts app on your smartphone