గతేడాది డిసెంబరు 4న హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడిన 9 ఏళ్ల శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిలో ఇంకా పెద్దగా మార్పు రాలేదు. శరీరంలో జీవ ప్రక్రియలన్నీ సక్రమంగా ఉన్నప్పటికీ శ్రీతేజ్ నుంచి స్థిరమైన ప్రతిస్పందనలు ఉండట్లేదని కిమ్స్ వైద్యులు బుధవారం తెలిపారు. కుటుంబీకులను కూడా గుర్తించట్లేదని చెప్పారు. ముక్కు వద్ద అమర్చిన సన్నని గొట్టం ద్వారానే అతనికి లిక్విడ్ ఆహారం అందిస్తున్నారు.
short by
Sri Krishna /
08:05 am on
30 Jan