సుమారు 8.5లక్షల ఏళ్ల క్రితం మానవుడు తన పిల్లల్ని నరికి చంపి ఆహారంగా తీసుకునేవాడని స్పెయిన్ పురాతత్వ శాస్త్రవేత్తలు జరిపిన తాజా పరిశోధనల్లో వెల్లడైంది. స్పెయిన్ గ్రాన్ డొలినాలో 4ఏళ్లలోపు వయసున్న ఓ చిన్నారి మెడ ఎముక లభ్యమైంది. వెన్నుపూస, తలను విడదీసేందుకు పదునైన వస్తువుతో నరికినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. పిల్లల్ని కూడా ఇతర జంతువుల మాదిరిగానే చంపేవారని చెప్పేందుకు ఇదే ప్రత్యక్ష నిదర్శనమన్నారు.
short by
Devender Dapa /
09:01 pm on
30 Jul